విశాఖ సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
VSP: ఈనెల 14,15వ తేదీల్లో జరగనున్న ప్రపంచస్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ మయూర్ అశోక్‌తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 3వేల మంది హాజరవుతారన్నారు. వారికి ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.