VIDEO: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
HYD: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద సీఎస్, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6వ తేదీన ఈ కార్యక్రమం ఉన్నందున 5వ తేదీలోపు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.