దేశంలో పదేళ్లలో లేనంతగా యూరియా కొరత: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రంలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో యూరియా కొరత ఏర్పడిందని తెలిపారు. చైనా-ఉక్రెయిన్‌ల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. ఇందులో తెలంగాణకు 35 వేల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే అందజేస్తామని చెప్పారు. త్వరలో మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి అందజేస్తామని స్పష్టం చేశారు.