టీటీడీ చైర్మన్‌కు వ్యతిరేకంగా పెనుకొండలో నిరసన

టీటీడీ చైర్మన్‌కు వ్యతిరేకంగా పెనుకొండలో నిరసన

సత్యసాయి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై పెనుకొండలో YCP నాయకులు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆదేశాల మేరకు కోట ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాల వల్ల టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటోందని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.