VIDEO: కళ్ల ముందే మునిగిన స్నేహితులు.. అంజలి ఆవేదన
ASR: అనంతగిరి మండలం మాలగుమ్మి జలపాతంలో ఫొటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి త్రిష, పవిత్ర, రత్నకుమారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ అంజలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంది. తన కళ్ల ముందే ముగ్గురు చెల్లెళ్లు నీట మునిగిపోతుంటే కాపాడమని గంటసేపు గట్టిగా అరిచినా, ఆ సమయంలో ఎవరూ లేరని ఆమె కన్నీటి పర్యంతమైంది.