రేపు హోంమంత్రి ఇఫ్తార్ విందు
AKP: నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈనెల 13వ తేదీన హోం మంత్రి వంగలపూడి అనిత ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రంజాన్ మాసం సందర్భాన్ని పురస్కరించుకుని సాయంత్రం ఏర్పాటు చేయబోయే ఇఫ్తార్ విందులో వెయ్యి మంది ముస్లిం సోదరులు హాజరు కానున్నట్లు నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పరిశీలించారు.