ప్రభుత్వాసుపత్రిలో ఐఏఎస్ అధికారి సతీమణి ప్రసవం

BDK: భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ సతీమణి మనీషా పంద్రాగస్టు రోజున భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఐఏఎస్ అధికారి కుటుంబం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకోవడం పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న నాణ్యమైన వైద్య సేవలకు ఇది నిదర్శనమని పీవో రాహుల్ అభిప్రాయపడ్డారు.