జాతీయ రహదారి పనులను పరిశీలించిన కలెక్టర్

జాతీయ రహదారి పనులను పరిశీలించిన కలెక్టర్

SS: గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని పురోగతిని పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.