స్వల్ప భూప్రకంపనలు.. తప్పిన ప్రమాదం
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రాత్రి 11:30 గంటలకు అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు, హుకుంపేట ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 30 సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో ఇళ్లలో నిద్రిస్తున్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. కొందరి ఇళ్లలో సామగ్రి కూడా కింద పడిపోయాయి. ఒడిశా సరిహద్దులోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు సమాచారం.