'ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి'
PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ఈరోజు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆసుపత్రిని పూలతో సుందరంగా అలంకరించారు. ఆసుపత్రి ప్రారంభంతో పరిసర గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.