ఎమ్మెల్యేకు బ్రహ్మోత్సవ ఆహ్వానం అందజేసిన కమిటీ
BHNG: గూడూరు గ్రామలోని ఉమామహేశ్వర ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ తృతీయ వార్షికోత్సవ గోడపత్రికను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, ఎమ్మెల్యేను ఆహ్వానించారు. సర్పంచ్ అలివేలు శ్రీనివాస్, ఆలయ కమిటీ ఛైర్మన్ గడ్డం కౌసల్య బాల్ రెడ్డి, నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.