అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ల పట్టివేత

KMR: బ్యాన్స్ వాడ పట్టణంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క సిలిండర్‌ను రూ. 2,500కి విక్రయిస్తూ, వినియోగదారులను మోసం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కొంత మంది గ్యాస్ సిలిండర్ల సీల్స్‌ను అక్రమంగా తొలగించి, గ్యాస్‌ను ఇతర ఖాళీ సిలిండర్లలో సగం మేర నింపి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.