యువ ఆపదమిత్ర శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

యువ ఆపదమిత్ర శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

KNR: NDMA, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ ఆపదమిత్ర కార్యక్రమంలో భాగంగా సామాజిక స్పృహ కల్గిన యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా మేరా యువ భారత్ జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ వెంకట్ రాంబాబు తెలిపారు. 18- 40 ఏళ్ల మధ్య వయసు, కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులుగా అర్హత ఉండాలన్నారు. దరఖాస్తు చేసేందుకు ఈనెల 20 వరకు అవకాశం ఉందన్నారు. వివరాలకు 0878-2243604 సంప్రదించగలరు.