రేపు ఉచిత కంటి వైద్య శిబిరం
CTR: సంతపేటలో ఆదివారం రాములవారిగుడి వీధిలోని జైన్ ప్రార్ధనా మందిరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన వారికి తిరుపతిలోని ఎస్వీ అరవింద కంటి ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్స చేయనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయి. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.