ఈనెల 19 నుంచి వైజ్ఞానిక ప్రదర్శన

ఈనెల 19 నుంచి వైజ్ఞానిక ప్రదర్శన

VZM: జిల్లా విద్యాశాఖ ఆద్వర్యంలో ఈనెల 19వ తేది నుంచి జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి యూ. మాణిక్యం నాయుడు బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ దాసన్నపేటలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో ఉన్న ఉప విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొంటారని చెప్పారు.