అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

శ్రీకాకుళం: కంచిలి మండలం నుంచి మెళియాపుట్టి మీదుగా నారాయణవలస సంతకు అక్రమంగా తరలిస్తున్న పశువులను సోమవారం సాయంత్రం చిన్నహంస వద్ద పట్టుకున్నట్లు ఎస్ఐ పిన్నింటి రమేష్ బాబు తెలిపారు. ఆరు ఆవులతో వెళుతున్న వాహనం సీజ్ చేసినట్లు తెలిపారు. వీటి యజమానిపై కేసు నమోదు చేసి ఆ ఆవులను కొత్తవలస గోశాలకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.