హ్యుందాయ్ 'వెన్యూ N లైన్' బుకింగ్స్ ప్రారంభం

హ్యుందాయ్ 'వెన్యూ N లైన్' బుకింగ్స్ ప్రారంభం

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ SUV వెన్యూలో పెర్ఫార్మెన్స్‌-ఓరియెంటెడ్ N లైన్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్‌ను భారత మార్కెట్‌లో నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు రూ.25 వేలు టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు, డిజైన్ వివరాలను వెల్లడించిన కంపెనీ, దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభించింది.