బీసీ గళం విజయవంతం చేయాలి: మాజీ సీఎం

బీసీ గళం విజయవంతం చేయాలి: మాజీ సీఎం

ATP: బీసీలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని YCP అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెల 26న అనంతపురం లలిత కళా పరిషత్ వేదికగా నిర్వహించనున్న BC గళం కార్యక్రమ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. గ్రామస్థాయిలో ప్రజలకు వాస్తవాలు వివరించి చైతన్యం కల్పించాలని సూచించారు. బీసీ సెల్ నేత రమేష్ పాల్గొన్నారు.