వర్షాలు.. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

TG: అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో కూడా పాఠశాలలకు సెలవు మంజూరు చేశారు.