వాగులో మహిళ మృతదేహం

NLR: వెంకటాచలం మండలంలో సోమవారం మహిళ మృతదేహం కలకలం రేపింది. అనికేపల్లి సమీపంలోని కర్రోడ వాగులో మహిళ మృతదేహం లభ్యమైంది. గ్రామస్థులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. వెంకటాచలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.