బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
BHPL: మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల పలు కారణాలతో మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఇంటింటికీ వెళ్లి పరామర్శించారు. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఓదార్పు చెప్పి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కార్యకర్తలకు ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.