రైల్వే స్టేషన్‌లో కూలిన ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి
AKP: అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఒక్కసారి కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయినట్లు సమాచారం. వెంటనే వారిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.