రేపు కొండగట్టు వరకు అంజన్న ఆశీర్వాద యాత్ర
KNR: కరీంనగర్‌లో శనివారం ఉదయం 7.00 గంటలకు మహాశక్తి ఆలయం నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొండగట్టు వరకు మహా పాదయాత్ర ప్రారంభమవుతుందని పెద్దపల్లి BJP జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.