నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ కొట్టివేత

విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే హైకోర్టు షాక్ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,578 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినట్లు గుర్తించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. లండన్‌కు వెళ్లిన సీబీఐ బృందం కోర్టులో నీరవ్ మోదీ తరపున లాయర్ వాదనలు వ్యతిరేకించింది. కాగా, నీరవ్ 2019, మార్చి 19 నుంచి యూకే జైలులో ఉంటున్నారు.