శిథిల భవనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్

MDK: జిల్లాలో వర్షం కారణంగా శిథిలావస్థలో ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలల భవనాలకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్ నుంచి డీఈవో, ఇంజనీరింగ్ అధికారులతో గూగుల్ మీట్‌లో చేసి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని 108 భవనాల నివేదికలు తయారు చేయాలన్నారు.