ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షునిగా రాజశేఖర్
సత్యసాయి: జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా అంగజాల రాజశేఖర్‌ను నియమించారు. ఈ నియామకంపై అంగజాల రాజశేఖర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్‌కి, నియోజకవర్గ ఇంఛార్జ్ హరీష్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని రాజశేఖర్ తెలిపారు.