'ఎమోషనల్ డైలాగులతో రైతులకు న్యాయం జరగదు'

'ఎమోషనల్ డైలాగులతో రైతులకు న్యాయం జరగదు'

AP: ఎమోషనల్ డైలాగులతో రైతులకు న్యాయం జరగదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భూములిచ్చిన రైతులకు ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదికి ఇచ్చే నామమాత్రపు డబ్బులతో ఉపయోగమేంటని ప్రశ్నించారు. ఇళ్లు, కమర్షియల్ స్థలాలతో పాటు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సూచించారు.