ఏలూరులో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ELR: 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు ఏలూరులో జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు అశ్రం హాస్పిటల్ వద్ద అటల్ చౌరస్తాలో గల మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.