చర్లపల్లి రైల్వే స్టేషన్లో సెల్ఫీ బూత్..!
HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కొత్తగా సెల్ఫీ బూత్ ఏర్పాటు చేశారు. ఈ బూత్‌లోకి వెళ్లి సెల్ఫీ తీసుకుంటే వెంటనే ఫొటో ప్రింట్ రూపంలో బయటకు వస్తుంది. ప్రయాణికులు సెల్ఫీ కాపీల సంఖ్య ప్రకారంగా, కొద్దిపాటి డబ్బు చెల్లిస్తే తమ సెల్ఫీ ఫొటోను వెంటనే పొందే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇది ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా అధికారులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.