మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు డబ్బు వృథా: బీజేపీ

మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు డబ్బు వృథా: బీజేపీ

HYD: సింగరేణి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం సింగరేణి ధనాన్ని ప్రభుత్వం వృథా చేసిందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు సింగరేణి కార్యాలయ ముట్టడికి యత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా, బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.