కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్న డీఎస్పీ

కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్న డీఎస్పీ

BDK: ఇల్లందు మండలం కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండ్లతండాలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం మంగళవారం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను సూచించారు. ఇళ్లలో సోదాలు నిర్వహించి నెంబర్ ప్లేట్, వాహనాల పత్రాలను పరిశీలించారు.