VIDEO: వాహనాల తనిఖీల్లో విద్యార్థి దుర్మరణం
కృష్ణా: గన్నవరం(M) కేసరపల్లిలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రణయ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆదివారం బైక్‌పై వెళ్తున్న ప్రణయ్‌ను పోలీసులు తనిఖీల్లో భాగంగా ఆపేందుకు ప్రయత్నించారు. భయంతో బైక్‌ను వెనక్కి తిప్పే క్రమంలో బొలెరో వాహనాన్ని ఢీకొట్టాడు. గాయపడిన అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.