ఘనంగా రైతు రుణమాఫీ సంబరాలు

ఘనంగా రైతు రుణమాఫీ సంబరాలు

KMM: రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. నేలకొండపల్లి రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రుణమాఫీ చేయడం సంతోషంగా వుందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.