ఆ విషయంలో భయమేస్తోంది: నరేష్

ఇప్పటివరకూ డేట్స్ విషయంలో తనపై ఒక్క ఫిర్యాదు లేదని నటుడు నరేష్ అన్నారు. 'హే భగవాన్' టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. కొన్ని మూవీలకు ఒకే చెప్పాలంటే డేట్స్ సర్దుబాటు చేయలేనేమోనని భయమేస్తోందని తెలిపారు. తనకోసం ఈ మూవీ షూటింగ్ తేదీల్లో మార్పులు చేశారని పేర్కొన్నారు. ఈ సినిమా అద్భుతమైన చిత్రమని, టైటిల్‌తోనే అందరిలో ఆసక్తిని కలిగించారని వెల్లడించారు.