జన్నారంలో లింగాయపల్లి గ్రామస్తుల ధర్నా
MNCL: అటవీ అధికారులు దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జన్నారం మండలంలోని లింగాయపల్లి గ్రామస్తులు ధర్నా చేశారు. ఆదివారం జన్నారంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వాగు వంతెన వద్ద వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. గొర్రె పిల్లల కోసం మేత తీసుకుని తాము వెళ్తుంటే అటవీ అధికారులు తమ వాహనాన్ని సీజ్ చేసి ఎఫ్ఆర్ఓ కార్యాలయానికి తరలించారని మండిపడ్డారు.