తుఫాను ప్రభావం.. రైతుల ఇబ్బందులు
విజయనగరం జిల్లాలోని మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చిన పత్తి పంట తడిసి రంగు మారినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంకా కేంద్రాలను తెరవలేదు. పత్తిని దాచుకునేందుకు మార్గంలేక, దళారులు ఇచ్చే ధర గిట్టుబాటుకాక సతమతమవుతున్నట్లు రైతులు పేర్కొన్నారు.