వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రవీందర్ రావు

వరంగల్: నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం అయోధ్య నగర్, అశోక్ నగర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం నియోజకవర్గ కన్వీనర్, వరంగల్ డీసీసీ అధికార ప్రతినిధి తక్కల్లపల్లి రవీందర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.