పహల్గామ్ మృతుడి తండ్రి భావోద్వేగం

పహల్గామ్ మృతుడి తండ్రి భావోద్వేగం

పాక్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై పహల్గామ్ దాడిలో మరణించిన శుభం ద్వివేది తండ్రి స్పందించారు. 'ఉగ్రదాడిలో నా కుమారుడు శుభం మరణంతో నా కోడలి జీవితం నాశనం అయింది. అందుకు భారత్ ఇవాళ ప్రతీకారం తీర్చుకుంది. నా కుమారుడి ఆత్మకు ఈరోజు శాంతి లభిస్తుంది. మెరుపుదాడులు చేపట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.