VIDEO: కాకినాడలో జాబ్ మేళా... అర్హులకు ఉద్యోగాలు
కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. జిల్లా ఉపాధి అధికారి శిరీష నేతృత్వంలో జరిగిన ఈ జాబ్ మేళాలో డి మార్ట్, స్మార్ట్ మేటర్ ఇన్స్టాలర్, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ వంటి కంపెనీలలో పని చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేశారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ బీఏస్సీ కెమిస్ట్రీ విద్యార్హత కలిగిన వారిని ఆయా కంపెనీలు ఎంపిక చేశారు.