VIDEO: పుంగనూరులో ఘనంగా రంజాన్ వేడుకలు
CTR: పుంగనూరులో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్‌ను ఘనంగా నిర్వహించారు. ఇవాళ పట్టణంలోని స్థానిక తపాలా శాఖ కార్యాలయం నుంచి NS పేట ఈద్గా మైదానానికి సామూహికంగా ముస్లిం సోదరులు చేరుకున్నారు. తర్వాత అల్లాను ప్రార్థిస్తూ ప్రత్యేక నమాజులు చేపట్టారు. అనంతరం పరస్పరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.