ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
RR: పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం వివిధ మండలాలకు చెందిన 74 మంది లబ్ధిదారులకు రూ.30,06,000 విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి అర్హుడికి సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.