డిప్యూటీ ఎంపీడీవోగా ప్రేమ్ కుమార్
సత్యసాయి: సోమందేపల్లి మండలంలో కొత్త ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ప్రేమ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాప్తాడు మండలం నుంచి బదిలీ అయిన ఆయన సోమందేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవోగా పదవీ బాధ్యతలు చేపట్టగా, కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.