VIDEO: 'మేఘాలకొండపై ఉదయం అద్భుతం'
ASR: డుంబ్రిగూడ మండలంలోని బిల్లాపుట్టు వద్ద ఉన్న మేఘాలకొండ గురువారం ఉదయం అపురూపమైన అందాలతో దర్శనమిచ్చింది. కొండల మధ్య నుంచి ఎగిసిన తెల్లని మేఘాలు పాల సముద్రంలా వ్యాపించి, వాటి మధ్య నుంచి తొంగిచూడసిన ఉదయకిరణాలు అందాలను రెట్టింపు చేశాయి. మేఘాలు, కొండలు, సూర్యకిరణాలు కలగలిసి సృష్టించిన ఈ సహజసిద్ధ దృశ్యాన్ని చూసిన వారంతా మంత్రముగ్ధులయ్యారు.