ప్రీహ్ విహార్‌పై భారత్ ఆందోళన
థాయ్‌లాండ్-కాంబోడియా మధ్య కొనసాగుతున్న ఘర్షణలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రీవ్ విహార్ పరిరక్షణ సౌకర్యాలు దెబ్బతినడం దురదృష్టకరమని తెలిపింది. యునెస్కో గుర్తింపు ప్రదేశంగా ఉన్న ప్రీవ్ విహార్ మానవాళి ఉమ్మడి సాంస్కృతిక వారసత్వ సంపదని చెప్పిది. ఆ ప్రదేశం పరిరక్షణకు సంబంధిత విభాగాలు అన్ని చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు రెండు దేశాలకు విజ్ఞప్తి చేసింది.