పాలెం గ్రామంలో పోలీసుల 'పల్లెనిద్ర' కార్యక్రమం
KKD: కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం బుధవారం రాత్రి నిర్వహించారు. జగ్గంపేట సీఐ YRK, ఎస్సై జి.సతీశ్ సిబ్బందితో కలిసి నేర రహిత సమాజంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించాలి, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. డ్రగ్స్, సైబర్ మోసాలు, చైన్ స్నాచర్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.