13 ఏళ్ల బాలుడిపై 48 ఏళ్ల టీచర్ లైంగిక దాడి

కర్ణాటకలో 13ఏళ్ల బాలుడిపై 48 ఏళ్ల మహిళా టీచర్ లైంగిక దాడికి పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. దాన్ని కొట్టివేయాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే ఆమె విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. చట్టం లింగాన్ని ఆధారంగా తీసుకోదని.. దాడి చేసినవారు పురుషుడు లేదా మహిళ అనే విషయం కాదని చెప్పింది. పిల్లవాడిపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అన్నదే ప్రధాన అంశమని స్పష్టం చేసింది.