ఉల్లి సాగుపై ఆసక్తి చూపని రైతులు

KDP: కాశీనాయన మండల వ్యాప్తంగా రైతులు ఎక్కువగా వందలాది ఎకరాలలో ఉల్లి పంటను సాగు చేస్తుండేవారు. ఈ ఏడాది కేవలం 139 ఎకరాలలో మాత్రమే ఉల్లి పంటను సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాటు గిట్టుబాటు ధరకు భరోసా లేకపోవడం వల్ల సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని రైతులు అంటున్నారు. కాగా, ఉల్లి పంటకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని రైతుల కోరుతున్నారు.