పార్టీ బలోపేతానికి కృషిచేయాలి: మాజీమంత్రి

WNP: రాజనగరం 12వ వార్డుకు చెందిన యూత్ కాంగ్రెస్ నేత వంశీ ఆ పార్టీని వీడి సోమవారం బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి వంశీకి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు సమన్వయంతో ముందుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్ పాల్గొన్నారు.