'ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు'
EG: అమృత్ పథకం ద్వారా కొవ్వూరు పట్టణానికి 70 కోట్లు మంజూరయ్యాయని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. కొవ్వూరులో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు.