రేపు దిశ కమిటీ సమావేశం

SRD: సంగారెడ్డి సమీకృత కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు దిశ కమిటీ సమావేశం జరుగుతుందని డీఆర్డివో జ్యోతి మంగళవారం తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని చెప్పారు. కమిటీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు సమావేశానికి సకాలంలో హాజరు కావాలని కోరారు.